నవ మాసాలు
(జమైకా ఫేర్వెల్ - పాట రాగంలో)
ఎక్కడైతే నవ్వులో, పాపలు వేసే చిందులో
అప్పుడే అది పండగో, అవి రోజూ వచ్చే వింతలో
ఆ నవ్వులే, చిరు చిందులే, ఆ పండగే ముందుందిలే
ఇంతలో నీ తొందరే, ఇంకా తొమ్మిది మాసాలే
గోల చేసే అరుపులో, వేసే తప్పటి అడుగులో
నీ గుండె మీద గంతులో, లేక బట్టల మీద మడుగులో
ఆ నవ్వులే, చిరు చిందులే, ఆ పండగే ముందుందిలే
ఇంతలో నీ తొందరే, ఇంకా ఎనిమిది మాసాలే
ఆట పేరుతో పరుగులో, పాట పేరుతో కేకలో
బొమ్మ కోసం డబ్బులో, మరి అల్లరి చేస్తే దెబ్బలో
ఆ నవ్వులే, చిరు చిందులే, ఆ పండగే ముందుందిలే
ఇంతలో నీ తొందరే, ఇంకా ఏడు మాసాలే
చదవమంటే బద్ధకం, సినిమా అంటే తక్షణం
పనులు ఇస్తే మానడం, పనికి మాలిన వ్యాపకం
ఆ నవ్వులే, చిరు చిందులే, ఆ పండగే ముందుందిలే
ఇంతలో నీ తొందరే, ఇంకా ఆరు మాసాలే
...
No comments:
Post a Comment