Friday, June 13, 2008

పిల్లాట

నల్లది వద్దుట, గోడ మీదది ఎటుట
చిట్టెలుకల మధ్యన, గంటెవరు పెట్టుట

చంకలోనే వుందట, ఊరంతా వెతుకుట
అడిగినా బిచ్చం లేదట, ఊరికే పీనాసట

తన కన్నులు మూతట, పాలు తాగేదెవరు చూడరట
నీ పక్కన చేరిందట, మ్యావు మ్యావుల మూట

2 comments:

Bolloju Baba said...

మీరు కవితలు వ్రాసే స్పీడు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.
బొల్లోజు బాబా

Viswamitra said...

Thanks for the compliments Baba garu. I hope the quality is alright as well.
-viswamitra