గతమే భవిష్ష్యత్తైతే...
నీ సంగతంతా తెలుసుగా
ఇక నీతో పనేముంది
నాకు జరగబోయేది ఎదురుగా
లైఫ్లో ఫన్ ఏముంది
నే నేర్చుకున్న పాఠమేంటో
ఎదురు చూశే వాటివెంటో
జ్యోతిష్యుడితో పనిఏంటో
దినము దాటి రాతిరేంటో
అందుకే...
ముందుకాలం మక్కువేగా
తెర వెనుక చిత్రమేగా
దాచినంత సత్యమేగా
ఇంతలో తొందరేలా?
Friday, May 30, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
గతమే భవిష్యత్తైతే మంచి ఊహ. చరిత్ర పు్నరావ్రుతమైతుందని అంటారు కానీ, వ్యక్తిగత గతం భవిష్యత్తవటం గమ్మత్తుగా ఉంది.
బ్యూటిఫుల్
బొల్లోజు బాబా
Thanks for the comments, Baba garu.
-viswamitra
Post a Comment