కా-దళ్ ("క" ప్రేమ)
వంపులు తిరిగిన సొంపులు, తలకట్టుతో నీ రాక
అందరి కన్న ముదలు; నీ అందం చూశాక
అడుగేసి దిగుతుంటే గుడి మెట్లు కిందికి
ఆర్పని కన్నుల చూపులు; ఆపలేను నీ పైకి
ఎదురొస్తే కోపమా; వాడి కొమ్ముల చూపుల శాపమా
అయినా నీ నడకల కులుకు, నా నుండి దాచకు
నీ బెట్టు నిమిషం వరకే, బహుకరించే కెంపుల కురకే
మూతుల ముడుపులాడకె, ముద్దుల సమయానికే
సుందరి ఇటు వచ్చిపో, ఈ మత్తుని కరిగించుకో
నీవు దూరంగా నిలిచివుంటే, "ఖ" చిత్తంగా దరి చేరుకో
వంపులు తిరిగిన సొంపులు, రాస్తున్నాను నీకు లేఖ...
Friday, May 9, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment