చీర (పాడిన పాట...)
నడుమును చుట్టుకోనా, మనసుని హత్తుకోనా
ఆల్లరి మానుకోనా, పిన్నులు గుచ్చుకోనా
గంజిని పుచ్చుకోనా, వానకి గొడుగు కానా
ఎండకు నీడనీనా, రాతిరి విడిచిపోనా
గిన్నెలు వేడి కాన, వాటిని దించి పోనా
కన్నీళ్లు కారుతున్న, వెంటనె తుడవ లేనా
వానలు వరదలైన, పైపైకి కదలలేనా
కూరల సంచి లేన, ముడేస్తే మూటకానా
అందాలు చూపలేనా, బంధాలు కలపలేనా
పంఖాలు లేకపోయిన, బదులుగ గాలినీనా
పిల్లలు భోంచేస్తే, మూతులు తుడిచి పోనా
కాలికి దెబ్బలైన, కట్లన్నీ కట్టిపోనా
అలిగితే భార్యకైన, కంచిపట్టు చీర కానా?
5 comments:
చీరతో ఇన్ని పనులు చేసుకోవచ్చా?
రోజూ చూస్తూనే ఉన్నా గమనించము మనం. చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని, అక్షరబద్దంచేసారు. హాట్సాఫ్
ఆ ఆ మరొకటి మరచారు. చీరకొంగుతో అన్నం తిన్నతరువాత మూతితుడుచుకోవటం. ముఖ్యంగా పిల్లలు చేస్తూంటారు. ఆపని ఎక్కువగా. కదూ
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
It's so nice. Need some more.
Baba garu,
your suggestion is added.
thanks.
-viswa
బాగా వచ్చింది.
మీ మరికొన్ని కవితలపై కామెంట్లు రాయలని ఉంది. వీలుచూసుకుని......
థాంక్స్
బొల్లోజు బాబా
Thanks, Indu garu.
Post a Comment